Tuesday, October 18, 2022

TRANSLATION OF 'संगरोध' INTO TELUGU- SAILAJA NANISETTI







SAILAJA NANISETTI




 నిర్బంధం 


సంతోషం 

ఇంట్లో ప్రతి మూలా 

కదులుతూ కిలకిలా 

 నవ్వుతూంది  ఇలా 

నువ్వంతా నేనే!

నేనంతా నువ్వే !!


మట్టిపిడతలో 

      కాసుల గలగల.. !

వెచ్చటి హృదిపై 

       జారుతున్న వాన చినుకుల్లా .. !!



ఓ మలయ వీచికా.. 

ఎవ్వరిదీ అనంత  విశ్వం?

పిపీలికాన్ని సైతం రక్షించే ఈ అఖండ బ్రహ్మాండం 

రక్ష నీకూ నాకూ !!


పురాతన బంధం ఈ గృహానికి ఆ గవాక్షం 

వీధిలో వినబడే పాదాల  సవ్వడి 

మనస్సున  నాటిన కవితా బాణం 


గగనాన గరుడిడి ఘీంకారం .. 

ఈ నిర్బంధ నిరాశ్రయులికి 

కలిగించమంటుంది ఉపశమనం 


బంధాల, అనుబంధాల ఆనందాల సంకెళ్ళలో 

బిగిసిన  ఆత్మచైతన్యం 

వాస్తవం ఇంకా క్రోసెడు దూరం


No comments:

Post a Comment